విజయసాయిరెడ్డి, కన్నాలపై సీపీఐ నారాయణ సెటైర్లు

  • కన్నా, పురందేశ్వరిలపై  విజయసాయి ఆరోపణలు
  • ఎన్నికలప్పుడు వీళ్లిద్దరికీ  కోట్ల రూపాయల డబ్బు అందింది
  • ఈ విషయాన్ని బీజేపీ నేతలు తేల్చాలి: నారాయణ డిమాండ్
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మహిళా నేత పురందేశ్వరికి ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల డబ్బు అందిందని, ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. విజయసాయిరెడ్డి ఎంపీ కనుక, ఆయన చెప్పిన మాటలు నమ్మాల్సి వస్తోందని అన్నారు.ఎంత డబ్బు పంపించారన్న విషయాన్ని బీజేపీ నాయకులు ప్రకటించకపోతే, విజయసాయిరెడ్డి చెప్పిందే నమ్మాల్సి వస్తుందని అన్నారు. ఎంత డబ్బు పంపించారో లేదో అన్న విషయాన్ని కేంద్రంలోని బీజేపీ తేల్చాలని అవసరం ఉందని  డిమాండ్ చేశారు. ఒకవేళ డబ్బు పంపకపోతే విజయసాయిరెడ్డి పై యాక్షన్ తీసుకుంటారా?లేదా? అనేది తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ వ్యాఖ్యలు అబద్ధమని కన్నా, నిజమేనంటూ విజయసాయిరెడ్డిలు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, ‘కరోనా’ దెబ్బకు దేవుళ్లే మాయమైపోతుంటే, ఇంకా వాళ్లను ఎందుకు తరిమేస్తారంటూ సెటైర్లు విసిరారు.



More Telugu News