పోలీసులు, కూరగాయలమ్మే వ్యక్తుల మధ్య ఘర్షణ.. పరస్పర దాడులు.. మీడియాకు చిక్కిన దృశ్యాలు
- యూపీలో ఘటన
- గొడవపడ్డ కూరగాయల వ్యాపారులు
- మధ్యలో వచ్చిన పోలీసులపై రాళ్ల వర్షం
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌తో దేశ వ్యాప్తంగా పలు చోట్ల పోలీసులతో స్థానికులు ఘర్షణకు దిగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో పోలీసులు, స్థానికంగా కూరగాయలు అమ్మే వ్యక్తులకు మధ్య ఈ రోజు తీవ్ర ఘర్షణ జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు దొరికింది. ఈ రోజు ఉదయం ఆ ప్రాంతంలో కూరగాయలు అమ్మే చిరు వ్యాపారులు గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే ఆ వ్యాపారులంతా కలిసి పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు.
దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. పలు షాపులు ధ్వంసమయ్యాయి. పోలీసులు, కూరగాయలు అమ్మే వ్యక్తులు పరస్పరం దుర్భాషలాడుకున్నారు.