ఇది ఒక జర్నలిస్టుపై మాత్రమే జరిగిన దాడి కాదు: నారా లోకేశ్
- అర్నబ్ పై దాడిని ఖండించిన లోకేశ్
- ప్రెస్ స్వేచ్ఛపై జరిగిన దాడి ఇది
- ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి ఘటనలు క్షమించరానివి
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి దంపతులపై నిన్న అర్ధరాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని స్టూడియో నుంచి ఆయన తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అయితే, వారికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఆయనపై జరిగిన దాడిని పలువురు నేతలు ఖండిస్తున్నారు. అర్నబ్ గోస్వామి దంపతులపై జరిగిన దాడిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.
'అర్నబ్ గోస్వామిపై జరిగిన దాడి కేవలం ఓ జర్నలిస్టుపై జరిగిన దాడి కాదు.. ప్రెస్ స్వేచ్ఛపై జరిగిన దాడి ఇది. ప్రజాస్వామ్య సమాజంలో ఇటువంటి ఘటనలు క్షమించరానివి' అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ దాడికి పాల్పడింది కాంగ్రెస్ యువ నాయకులేనని అర్నబ్ గోస్వామి ఓ వీడియో పోస్ట్ చేసి ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుటుంబానిదే బాధ్యతని పేర్కొన్నారు.