ప్రధాని సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో మునిగి తేలుతున్నాడట బాబు!: విజయసాయిరెడ్డి

  • తానిప్పటికీ సీఎం అన్నట్లు బాబు భ్రాంతి
  • కొవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది
  • ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది
ఆంధ్రప్రదేశ్‌లో సమాంతర ప్రభుత్వం నడపాలని ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చారని, ఆ సలహా ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహూకరించారని కొందరు అంటున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

'తానింకా సీఎం అయినట్టు, ప్రధాని రోజూ నాలుగు సార్లు ఫోన్ చేసి సలహాలు అడుగుతున్నట్టు భ్రాంతిలో మునిగి తేలుతున్నాడట బాబు. సమాంతర ప్రభుత్వం నడపాలని సలహా ఇచ్చినాయన ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ తయారు చేయించి బాబుకు బహూకరించారని కొందరు అంటున్నారు' అంటూ ట్వీట్ చేశారు.

'రాష్ట్రాధినేత సమర్థత, సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగే చొరవ సంక్షోభ సమయాల్లో ప్రజలను ఆపద నుంచి గట్టెక్కిస్తాయి. కొవిడ్ నియంత్రణ, తక్కువ ప్రాణనష్టంతో ఏపీ దిశా నిర్దేశం చేస్తుంది. ప్రతి రాష్ట్రం మనల్ని అసుసరిస్తుంది. కేంద్రం ఇప్పటికే ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరా తీస్తోంది' అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.


More Telugu News