విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ తరలింపుపై అఫిడవిట్‌ దాఖలు చేయండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

  • ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ తరలింపు యత్నాలు జరుగుతున్నాయని పిటిషన్
  • విచారణపై 10 రోజులు వాయిదా వేసిన హైకోర్టు
  • 'తరలింపు'పై ఉద్యోగ సంఘాల ప్రకటనను తెలిపిన పిటిషనర్
  • విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా పేర్కొన్న వైనం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ను తరలించేందుకు ప్రయత్నిస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంపై 10 రోజుల్లోగా పూర్తి వివరాలు తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీ సర్కారుకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ పిటిషన్‌పై మళ్లీ 10 రోజుల తర్వాత విచారణ చేపడతామని పేర్కొంటూ వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం ఏపీలోని వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని విశాఖకు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన కోరారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ తరలింపుపై ఉద్యోగ సంఘాల ప్రకటన, వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి గతంలో మీడియా సమావేశంలో చెప్పిన పలు అంశాలను పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.


More Telugu News