రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!

  • బియ్యంతో పాటు కందిపప్పు ఉచితం
  • సబ్సిడీపై గోధుమలు, పంచదార కూడా
  • మేలో ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణలో ఆహార భద్రతా కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేలో ప్రతి కార్డుదారుడికీ ఉచితంగా అందించే బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు, పంచదారను కూడా అందించాలని నిర్ణయించింది. రెండు కిలోల గోధుమలు, పంచదార మాత్రం సబ్సిడీ ధరపై అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 లక్షల 930 కుటుంబాలుండగా, అన్ని కార్డులనూ కలిపి 55,75,583 మందికి రేషన్ అందించాల్సి వుంది.

అందుకుగాను మొత్తం 6,83,06,702 కిలోల బియ్యాన్ని, 16 లక్షల 930 కిలోల కంది పప్పును, 32.18 లక్షల కిలోల గోధుమల కోటాను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిలో గోధుమలు, పంచదార రిలీజింగ్ ఆర్డర్ ను మీ సేవా ఆన్ లైన్ ద్వారా పొందవచ్చని, చెల్లింపులు కూడా అక్కడి నుంచే జరపాలని పౌర సరఫరాల శాఖ నుంచి డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర గోడౌన్లలో బియ్యంతో పాటు కందిపప్పు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, లాక్ డౌన్ కారణంగా పనిలేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.


More Telugu News