దమ్ముంటే కర్నూలు వెళ్లండి: జగన్‌కు దేవినేని సవాల్
- కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి
- నెల రోజుల్లోనే రాష్ట్రంలో కేసులు వెయ్యి దాటాయి
- జగన్ మాత్రం తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దమ్ముంటే కర్నూలు వెళ్లాలని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 12 రెడ్‌జోన్‌లో ఉన్నాయన్న ఆయన.. కర్నూలులో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు.
ఇక రాష్ట్రంలో నెల రోజుల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటిందని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లిలోని తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని విమర్శించారు.
నిజానికి రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న విషయమైనా జగన్‌కు తెలుసా? అని దేవినేని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించాలని, కేసులు, రిపోర్టుల విషయంలో వాస్తవాలను బయటపెట్టాలని ఉమ డిమాండ్ చేశారు.