కరోనా సాధారణ జ్వరం కాదు... ఊపిరితిత్తుల్ని మింగేస్తుంది: పవన్ కల్యాణ్

  • కరోనా భయంకరరోగం కాదన్న సీఎం జగన్
  • ఇది సాధారణ జ్వరం అనుకోవద్దంటున్న పవన్
  • కావాలంటే సైన్స్ న్యూస్ కథనం చదవాలంటూ ట్వీట్
కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది.... ఇది భయంకరమైన రోగం కాదు అని సీఎం జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనం అనుకుంటున్నట్టు కొవిడ్-19 (కరోనా) సాధారణ జ్వరం కాదు. కొవిడ్-19 వైరస్ కారణంగా రోగుల  ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కావాలంటే 'సైన్స్ న్యూస్' లో వచ్చిన ఈ కథనం చదువుకోండి" అంటూ సదరు లింకును కూడా పవన్ ట్వీట్ చేశారు.


More Telugu News