త్రివిక్రమ్ ముందుచూపు .. రొమాంటిక్ లవ్ స్టోరీ సిద్ధం

  • ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ
  • 'ఆర్ ఆర్ ఆర్' పూర్తి చేయవలసిన ఎన్టీఆర్
  • మరో ప్రాజెక్టు హీరోలుగా తెరపైకి నాని - చైతూ పేర్లు
త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్నాడు. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ తో కల్యాణ్ రామ్ -  చినబాబు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ ఫైనల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వున్నాడు. అయితే లాక్ డౌన్ తరువాత త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు ఇంకా మిగిలే వుంది. ఆ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ ఎన్టీఆర్ తన లుక్ ను కంటిన్యూ చేయవలసే ఉంటుంది.

'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ పోర్షన్ కి సంబంధించిన షూటింగు ఎప్పుడు పూర్తవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అందువలన ఈ లోగా ఓ మాదిరి బడ్జెట్ లో 'అ ఆ' వంటి సినిమా ఒకటి చేయాలనే ముందుచూపుతో త్రివిక్రమ్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన హీరోలుగా నాని .. చైతూ పేర్లు తెరపైకి వచ్చాయి. 'ఆర్ ఆర్ ఆర్' నుంచి ఎన్టీఆర్ రావడం ఆలస్యమైతే, ఈ లోగా త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును పూర్తి చేసేస్తాడన్న మాట.


More Telugu News