‘కరోనా’నూ కాసుల పంటగా చంద్రబాబు మార్చుకునే వారే!: వైసీపీ నేత జోగి రమేశ్
- ఈ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే..
- ఏపీలో ‘కరోనా’ కట్టడికి మా ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది
- టీడీపీ నేతలు వారి ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ‘కరోనా’ను కూడా కాసుల పంటగా మార్చుకుని ఉండేవారని విమర్శించారు.
ఏపీలో ‘కరోనా’ కట్టడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న తమ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తమ ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలెవ్వరూ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబుకు శాశ్వత క్వారంటైన్ తప్పదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.