సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వెబ్ సీరీస్ లో అమలా పాల్ 
  • బాలయ్య, బి.గోపాల్ ప్రాజక్ట్ అప్ డేట్
  • మురుగదాస్ చిత్రంలో కాజల్  
 *  ఇప్పటికే కాజల్, సమంత వంటి టాప్ స్టార్లు డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. అదే కోవలో తాజాగా కథానాయిక అమలాపాల్ కూడా పయనిస్తోంది. హిందీలో మహేశ్ భట్ నిర్మిస్తున్న ఓ వెబ్ సీరీస్ లో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తోంది.
*  గతంలో పలు హిట్ చిత్రాలను అందించిన బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ లో చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును ఆగస్టు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓపక్క బోయపాటితో నడుస్తున్న ప్రాజక్టును చేస్తూనే, బాలకృష్ణ ఈ చిత్రాన్ని కూడా చేస్తారట.
*  గతంలో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'తుపాకి' చిత్రం విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం. 'తుపాకి'లో కూడా కాజలే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.


More Telugu News