అమెరికాలో ఒక్కరోజులో 2,000 పైగా మరణాల నమోదు!

  • ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 32,56,846
  • 20,31,000 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న పది లక్షల మంది
  • 2,33,388 మంది మృతి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అమెరికాలో గత 24 గంటల్లో 2,053 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 2000 దాటి మరణాలు రికార్డవడం వరుసగా ఇది మూడవ రోజు. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య 62,906కు చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. అమెరికాలో ప్రతి రోజు 2,000కు పైగానే మృతుల సంఖ్య నమోదవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  32,56,846గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 20,31,000 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు సుమారు పది లక్షల మంది  కోలుకున్నారు. 2,33,388 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇటలీలో ఇప్పటివరకు 27,967 మంది మృతి చెందగా, స్పెయిన్‌లో ఇప్పటివరకు 24,543 మంది ప్రాణాలు కోల్పోయారు. యూకేలో 26,771, ఫ్రాన్స్‌లో 24,376, జర్మనీలో 6,623, టర్కీలో3,174, ఇరాన్‌లో 6,028, బ్రెజిల్‌లో 6,006 మంది మృతి చెందారు.

అమెరికాలో అత్యధికంగా 1,53,947 మంది కోలుకోగా, జర్మనీలో 1,23,500 మంది, స్పెయిన్‌లో 1,12,050 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇండోనేసియాలో కరోనా కేసులు కొన్ని రోజుల నుంచి పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఆ దేశంలో కేసుల సంఖ్య 10 వేలు దాటింది.


More Telugu News