హెలికాప్టర్ల నుంచి దేశంలోని వైద్యులు, ఆసుపత్రులపై పూల వర్షం.. వీడియోలు ఇదిగో

  • గాంధీ వైద్యులు, సిబ్బందిపై కూడా పూల వర్షం
  • దేశంలోని వైద్యులకు అరుదైన గౌరవం
  • ఢిల్లీలోని పోలీసు యుద్ధ స్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూల వర్షం
కరోనా పోరాట యోధులకు దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం దక్కింది. వారికి సంఘీభావంగా దేశ రక్షణ దళాలు పూల వర్షం కురిపించాయి. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై హెలికాప్టర్‌ల నుంచి పూల వర్షం కురిసింది. ఐఏఎఫ్ హెలికాప్టర్లు గాంధీ ఆసుపత్రిపై తిరుగుతూ పూలు కురిపించాయి.
                                                                               
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో నిలిపి ఉంచిన నౌకలకు నేడు విద్యుత్‌ దీపాలంకరణ చేయనున్నారు. అలాగే, ముంబై, చెన్నై, కొచ్చిలోని నౌకలకు కూడా దీపాలంకరణ చేస్తారు. విశాఖలో వైద్యులను కలిసిన నౌకాదళ అధికారులు వారికి అభినందనలు తెలిపారు. ఛాతీ ఆసుపత్రితో పాటు వైద్యులపై నావికాదళ హెలికాప్టర్లు పూలు చల్లాయి.

నిరంతరం సేవలు అందిస్తోన్న పోలీసుల సేవలకు గుర్తుగా ఢిల్లీలోని పోలీసు యుద్ధ స్మారకం వద్ద వైమానిక హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. పోలీసుల గౌరవార్థం యుద్ధ స్మారకానికి వైమానిక దళాలు పూల దండలు వేశారు. గోవాలోని పణాజీ మెడికల్‌ కాలేజీ, వైద్యులు, నర్సులపై హెలికాప్టర్‌ నుంచి పూల వర్షం కురిసింది. దేశంలోని నలు మూలల ఉన్న కరోనా ఆసుపత్రుల్లో హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురుస్తోంది.



More Telugu News