తబ్లిగీ జమాత్ కార్యకర్తలు కరోనాను దాచడం వల్లే ఈ విపత్తు: యోగి ఆదిత్యనాథ్
- తబ్లిగీ జమాత్ పై యూపీ సీఎం ఆగ్రహం
- వైరస్ సోకినా దాచివుంచడం నేరమని వెల్లడి
- దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాతే కారణమని ఆరోపణ
దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కార్యకర్తలే కారణమని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బారినపడడం నేరమేమీ కాదని, కానీ వైరస్ సోకినా దాచి ఉంచడమే అసలైన నేరం అని స్పష్టం చేశారు.
ఆ విధమైన నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని అన్నారు. ఈ తరహా నేరానికి తబ్లిగీ జమాత్ తో సంబంధం ఉన్నవాళ్లు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో తబ్లిగీ జమాత్ పాత్ర ఖండించదగినదని అభిప్రాయపడ్డారు. "ఉత్తరప్రదేశ్ లో కానీ ఇతర ప్రదేశాల్లో కానీ కరోనా వ్యాప్తి వెనుక తబ్లిగీ జమాత్ ఉంది. వారు కరోనాను దాచి పెట్టకుండా, కరోనా వాహకాలకు తిరగకుండా ఉంటే కరోనా మరింత మందికి సోకకుండా నివారించగలిగే వాళ్లం" అని వ్యాఖ్యానించారు.