యంగ్ హీరో నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్

  • ఏజెంట్ సినిమాతో పడిన హిట్
  • విడుదలకి ముస్తాబవుతున్న 'జాతిరత్నాలు'
  • మరో సినిమాకి సన్నాహాలు
'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతో నవీన్ పోలిశెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత గ్యాప్ తీసుకుని ఆయన మరో విభిన్నమైన కథను ఎంచుకున్నాడు. 'జాతిరత్నాలు' పేరుతో ఈ సినిమా నిర్మితమైంది.  ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వున్న నవీన్ పోలిశెట్టి, యువ దర్శకులు వినిపించే కథలను ఫోన్  ద్వారానే వింటూ వస్తున్నాడట. అలా ఓ దర్శకుడు వినిపించిన ఒక కథ బాగా నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. లాక్ డౌన్ తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.


More Telugu News