ఆ సినిమా ఫ్లాప్ అయింది .. ఓ పాఠం నేర్పింది: హీరోయిన్ తమన్నా
- హిందీలో నా తొలి సినిమా 'హిమ్మత్ వాలా'
- ఆ పరాజయం ఎక్కువ కాలం వెంటాడలేదు
- జాగ్రత్తపడేలా చేసిందన్న తమన్నా
తెలుగు .. తమిళ భాషల్లో అందాల తారగా తమన్నాకి మంచి క్రేజ్ వుంది. బాలీవుడ్ తెరకి కూడా తన నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేయడానికి ఆమె చాలా ఆరాటపడింది. ఆమె ప్రయత్నాలు ఫలించి, తొలి చిత్రంగా 'హిమ్మత్ వాలా' చేసింది. ఆ సినిమాను గురించి తమన్నా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.
'బాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే ఎన్నో ఆశలతో 'హిమ్మత్ వాలా' చేశాను. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో నేను చాలా డీలాపడిపోయాను. ఆ సమయంలో ఇతర భాషా చిత్రాలతో నేను బిజీగా ఉండటం వలన, ఆ సినిమా పరాజయం నన్ను ఎక్కువకాలం పాటు వెంటాడలేకపోయింది. ఆ సినిమా పరాజయం పాలైనా, నాకు ఒక పాఠం నేర్పినందుకు ఆనందపడ్డాను. ఒక కథను ఒప్పుకోవడానికి ముందు ఎంతలా ఆలోచించాలి .. ఒక పాత్ర చేయడానికి ముందు ఆ పాత్రను గురించి ఎంతవరకూ తెలుసుకోవాలి వంటి విషయాలు నాకు అర్థమయ్యాయి. అప్పటి నుంచి కెరియర్ పరంగా నేను జాగ్రత్త పడటానికి ఆ సినిమా నాకు చాలా హెల్ప్ అయింది. అందువలన ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని చెప్పుకొచ్చింది.