నాకు లాక్ డౌన్ మొదలై 22 ఏళ్లు అయింది: అజయ్ దేవగణ్
- 22 ఏళ్ల క్రితం కాజోల్, అజయ్ దేవగణ్ వివాహం
- కాజోల్ తో ఉన్న ఫొటోను షేర్ చేసిన అజయ్
- అభిమానుల నుంచి భారీ స్పందన
కరోనా కారణంగా జనాలంతా దాదాపు నెలన్నర నుంచి లాక్ డౌన్ లో గడుపుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సరదా వ్యాఖ్యలు చేశాడు. తనకు లాక్ డౌన్ మొదలై 22 ఏళ్లు అయినట్టు అనిపిస్తోందని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కామెంట్ చేశాడు. అజయ్ లాక్ డౌన్ కామెంట్ పై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తన భార్య కాజోల్ తో కలసి గతంలో దిగిన ఫొటోను షేర్ చేశాడు. 22 ఏళ్ల క్రితం అజయ్ దేవగణ్, కాజోల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.