సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • షార్ట్ ఫిలింలో నటించిన త్రిష 
  • రామ్ తమిళ సినిమా కబుర్లు
  • శ్రీకాంత్ అడ్డాల మరో సినిమా   
 *  అందాలతార త్రిష తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, గౌతం మీనన్ దర్శకత్వంలో ఈ లఘు చిత్రాన్ని చేశారు. గతంలో గౌతం మీనన్ దర్శకత్వంలో త్రిష చేసిన విన్నైత్తాండి వరువాయ (తెలుగులో ఏ మాయ చేసావే) తమిళ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి విదితమే.  
*  స్ట్రెయిట్ తమిళ సినిమాలో నటించాలని తాను ఎంతో ఆసక్తితో వున్నానని అంటున్నాడు యంగ్ హీరో రామ్. తాను చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగానని, దాంతో తనకి తమిళం బాగా వచ్చునని చెప్పాడు. మంచి కథ కోసం చూస్తున్నాననీ, దొరకగానే తమిళ చిత్రంలో నటిస్తానని అన్నాడు.
*  గతంలో శర్వానంద్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'కూచిపూడి వారి వీధి' పేరిట ఓ చిత్రాన్ని చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. అంతలోనే ఆ ప్రాజక్టు ఆగిపోయిందని కూడా అన్నారు. అయితే, ఆ ప్రాజక్టు ఆగిపోలేదని, ప్రస్తుతం తాను వెంకటేశ్ తో చేస్తున్న 'నారప్ప' చిత్రం పూర్తవగానే శ్రీకాంత్ ఆ చిత్రాన్ని చేస్తాడని తాజా సమాచారం.


More Telugu News