హైదరాబాద్‌లో పెరిగిన వాహనాల రాకపోకలు.. భారీగా రోడ్లపైకి ప్రజలు
- లాక్‌డౌన్‌లో సడలింపులు
- కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌లను పునరుద్ధరించిన అధికారులు
- మూసేసిన ఫ్లైఓవర్లను మళ్లీ తెరిచిన పోలీసులు
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో పలు రంగాలకు సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్‌లో ఈ రోజు వాహనాల రాకపోకలు పెరిగాయి. రహదారిపైకి వాహనదారులు భారీగా వస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి పలు రంగాలకు సడలింపులు ఇవ్వడంతో రద్దీ పెరిగింది.
హైదరాబాద్‌లోని కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌లను అధికారులు పునరుద్ధరించారు. లాక్‌డౌన్‌తో మూసేసిన ఫ్లైఓవర్లను మళ్లీ తెరవడంతో వాటిపై నుంచి కూడా వాహనదారులు వెళ్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇనుము, సిమెంట్, ఇసుక, కంకర తదితర వస్తువుల విక్రయాలు, సరఫరాకు అనుమతి ఇచ్చింది.
వీటిని రవాణా చేసే వాహనాలను ఆపొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నిత్యావసర సరుకులు, స్టీల్, హార్డ్ వేర్ షాపులు, నిర్మాణ రంగ పనులకు సంబంధించిన దుకాణాలు, వ్యవసాయ సంబంధ పనిముట్ల షాపులు కూడా పనిచేస్తున్నాయి. రాత్రి 7 గంటల వరకు షాప్ లు నడుస్తాయి. రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు.