ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ప్రసూతి ఆసుపత్రిలో విచక్షణ రహితంగా కాల్పులు.. పసికందులనూ వదలని ముష్కరులు!
- మొత్తం 14 మంది మృతి.. మృతుల్లో అప్పుడే కళ్లు తెరిచిన ఇద్దరు పసికందులు
- నేలకొరిగిన బాలింతలు, నర్సులు
- మరో ఘటనలో 21 మంది దుర్మరణం
ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఓ ప్రసూతి ఆసుపత్రిలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పసికందులు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ కాబూల్‌లో జరిగిందీ దారుణం. ఆసుపత్రిలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులు చికిత్స పొందుతున్న మహిళలు, అప్పుడే కళ్లు తెరిచిన పసికందులపై తూటాల వర్షం కురిపించారు.
ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరు అప్పుడే పుట్టిన చిన్నారులు ఉండడం గమనార్హం. చనిపోయిన మిగతా 12 మందిలో బాలింతలు, నర్సులు ఉన్నారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.
మరో ఘటనలో 21 మంది మృతి చెందారు. ఓ మిలీషియా కమాండర్ అంత్యక్రియల కార్యక్రమంపై ఆత్మాహుతి సభ్యుడు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు.