కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై కదల్లేని స్థితిలో చిరుత.. పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు!

  • పట్టుకునే ప్రయత్నంలో తప్పించుకుని ఫంక్షన్ హాల్‌లోకి
  • ఓ వ్యక్తికి గాయాలు
  • పట్టుకునేందుకు శ్రమిస్తున్న జూపార్క్, అటవీ సిబ్బంది
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై ఈ ఉదయం కనిపించిన ఓ చిరుత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే, పరిశీలించి చూడగా.. కాలికి గాయమై కదల్లేని స్థితిలో అది ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వచ్చీపోయే వాహనాలపై చిరుత దాడిచేసే అవకాశం ఉండడంతో రాకపోకలను నియంత్రించారు.

అనంతరం దానిని బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలోనే ఉన్న ఫంక్షన్ హాలుకు చేరుకుంది. తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తిని గాయపరిచింది. అది ఇంకా తప్పించుకుని తిరుగుతుండడంతో బంధించేందుకు అటవీ, జూపార్క్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిరుత దాడిలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.


More Telugu News