నేను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నానని తెలంగాణ డీజీపీకి కంప్లెయింట్ ఇప్పించావు: చంద్రబాబుపై విజయసాయి విసుర్లు
- అడ్డంగా దొరికిపోయావు బాబూ అంటూ ట్వీట్
- వైజాగ్ వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఎందుకు కోరావంటూ ప్రశ్నాస్త్రం
- నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదంటూ విమర్శించారు. మరోసారి అడ్డంగా దొరికిపోయావు బాబూ అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "నేను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నానంటూ తెలంగాణ డీజీపీకి కంప్లెయింట్ ఇప్పించావు. మరి వైజాగ్ వెళ్లడానికి డీజీపీలను అడగకుండా కేంద్రం అనుమతి ఎందుకు కోరావు? నీ డ్రామాలు తెలియనంత అమాయకులు ఎవరూ లేరు" అంటూ స్పందించారు.