శ్రీశైలంలో పర్యటించిన కేంద్ర బృందం... కరోనా కేసుల్లేకపోవడంపై సంతృప్తి!

  • కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇద్దరు సభ్యుల బృందం రాక
  • కేంద్ర బృందానికి వివరణ ఇచ్చిన శ్రీశైలం ఆలయ ఈవో
  • పలు సూచనలు చేసిన కేంద్ర బృందం
కేంద్రం నుంచి వచ్చిన ఇద్దరు సభ్యుల బృందం ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో పర్యటించింది. ఓ వైపు కర్నూలు జిల్లాలో లెక్కకు మిక్కిలిగా కరోనా కేసులు వెల్లడవుతున్నా, శ్రీశైలంలో కరోనా కేసుల్లేకపోవడం పట్ల కేంద్ర బృందం విస్మయం వ్యక్తం చేసింది. శ్రీశైలంలో చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను ఈవో రామారావు కేంద్ర బృందానికి వివరించారు. ఈవో వివరణతో ఆ ఇద్దరు సభ్యులు సంతృప్తి చెందారు. లాక్ డౌన్ తొలగించిన అనంతరం కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లాక్ డౌన్ ను ఎత్తేశాక పరిమిత సంఖ్యలో దర్శనాలకు అనుమతించాలని అన్నారు.


More Telugu News