గుంటూరులో కలకలం.. కరోనా పేషెంట్లను తరలిస్తున్న అంబులెన్స్ బోల్తా!

  • నరసరావుపేట నుంచి మంగళగిరికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ప్రమాదం
  • లారీని తప్పించబోయి బోల్తా కొట్టిన అంబులెన్స్
  • ఇద్దరు కరోనా పేషెంట్లకు గాయాలు
కరోనా సమయంలో అంబులెన్స్ లు ఫుల్ బిజీగా ఉంటున్నాయి. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని, పేషెంట్లను తరలిస్తూ నిరంతరం పని చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలో ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న అంబులెన్సు ప్రమాదానికి గురైంది.

నరసరావుపేట నుంచి మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గుంటూరులోని జైలక్ష్మి హోండా షోరూమ్ కు రాగానే ఎదురుగా ఉన్న లారీని అంబులెన్స్ తప్పించబోయి, బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్సులోని ఇద్దరు పేషెంట్లకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పెదకాకాని పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి వేరే అంబులెన్సులో పేషెంట్లను ఆసుపత్రికి తరలించారు. కరోనా పేషెంట్లకు ప్రమాదం జరిగిందనే వార్తతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.


More Telugu News