మిగిలిన టెన్త్ పరీక్షలు రద్దు చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్... రాసిన పరీక్షల ఆధారంగానే ర్యాంకులు!

  • మధ్యలో నిలిచిన టెన్త్ పరీక్షలు
  • ఇక నిర్వహించే అవకాశాలు లేవన్న ప్రభుత్వం
  • జూన్ 8 నుంచి ఇంటర్ పరీక్షలు
మధ్యప్రదేశ్ లో మిగిలిపోయిన పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని పరీక్షలు జరిగిన తరువాత లాక్ డౌన్ అమలులోకి వచ్చి, మిగతా పరీక్షలు రద్దు కావడంతో, పెండింగ్ పరీక్షలను నిర్వహించరాదని నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు.

వాస్తవానికి రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు మార్చి 3 నుంచి 27 వరకూ పరీక్షలు జరగాల్సి వుండగా, కొన్ని పరీక్షలు ఆగిపోయాయి. వీటిని నిర్వహించే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డ ప్రభుత్వం, ఇప్పటివరకూ జరిగిన పరీక్షల ఫలితాల ఆధారంగానే మెరిట్ లిస్టును తయారు చేయాలని నిర్ణయించింది. ఇక మిగిలిపోయిన ఇంటర్ పరీక్షలను జూన్ 8 నుంచి 16 మధ్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


More Telugu News