ఏపీలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
- రోజుకు 12 గంటలు మాత్రమే తిరగనున్న బస్సులు
- ప్రయాణికులు మాస్కులు ధరించాలి
- బస్సులు మధ్యలో ఎక్కడా ఆగవు
లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితం అయిన ఆర్టీసీ బస్సులు ఇప్పటికే తెలంగాణలో పునఃప్రారంభమయ్యాయి. రేపటి నుంచి ఏపీలో పరుగులు పెట్టనున్నాయి. డిపోల్లో ఉన్న బస్సులను శుభ్రం చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గత 55 రోజులుగా డిపోలకే బస్సులు పరిమితం కావడంతో... వాటి ఇంజిన్ కండిషన్ ను చెక్ చేస్తున్నారు. రేపటి నుంచి ఏపీలో బస్సులు తిరగనున్న నేపథ్యంలో... కొన్ని వివరాలను తెలుసుకుందాం.
- రోజుకు 12 గంటల పాటు మాత్రమే బస్సులు తిరుగుతాయి
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు బస్సులు నడుస్తాయి
- ఈరోజు సాయంత్రం నుంచే రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి
- ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోని వారి కోసం... డిపోల్లో బస్సు ఎక్కే ముందు టికెట్లను ఇచ్చే ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానున్నారు
- బస్సుల్లో టికెట్లు ఇవ్వడం అన్నది ఉండదు
- తొలి విడతగా 1500 బస్సులు తిరగనున్నాయి
- బస్సుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి
- ప్రయాణికులు మాస్కులు కచ్చితంగా ధరించాలి
- బస్సులు మధ్యలో ఎక్కడా ఆగవు. కేవలం గమ్యస్థానంలో మాత్రమే ఆగుతాయి