వారికి పరీక్షలొద్దు.. పాస్ చేయండి: యూజీసీకి మహారాష్ట్ర విన్నపం

  • డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేం
  • విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టలేం
  • అందరినీ ప్రమోట్ చేయండి
యూజీసీకి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక విన్నపం చేస్తూ లేఖ రాసింది. తమ రాష్ట్రంలోని విద్యాలయాల్లో చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ, పీజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేయాలని కోరింది. కరోనా ప్రభావం విద్యాసంవత్సరంపై తీవ్రంగా పడిందని, ఈ సమయంలో వారిని ఇబ్బందులకు గురిచేయలేమని యూజీసీకి రాసిన లేఖలో మహారాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామ్రాట్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది వరకు విద్యార్థులు ఉన్నారని, ఈ సమయంలో వారిందరికీ పరీక్ష కేంద్రాలు కేటాయించడం, వారి ప్రొటోకాల్ చూసుకోవడం కష్టమైన పని అని, ప్రస్తుత పరిస్థితుల్లో వారి ఆరోగ్యాలను పణంగా పెట్టలేమని అన్నారు. కాబట్టి ఎటువంటి పరీక్షలు లేకుండానే డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని మంత్రి కోరారు.


More Telugu News