'బతుకుబళ్లు' సీజ్ చేశారు.. విడుదల చేయాలని ప్రజలు అడుగుతున్నారు: దేవినేని ఉమ

  • లాక్‌డౌన్‌లో‌ స్వాధీనం చేసుకున్న బైక్‌లు పీఎస్‌లలోనే ఉన్నాయి
  • ఆ బైక్‌ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు
  • స్టేషన్ల ముందు లక్షలాది వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి
  • పెనాల్టీలు లేకుండా తక్షణం వాహనాలు విడుదల చేయాలి
కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్‌లో స్వాధీనం చేసుకున్న బైక్‌లు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీ‌స్‌ స్టేషన్లలో పడి ఉండడం పట్ల టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటినుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లన్నీ పోలీస్‌ స్టేషన్‌లలోనే ఉండిపోవడంతో ఆ బైక్‌ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, మరోపక్క వాటిని వాడకపోవడంతో పాడైపోతున్నాయని, కొన్ని తుప్పుపట్టిపోతున్నాయని  ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని దేవినేని ఉమ పోస్ట్ చేశారు.

'బతుకుతెరువు కోసం రోడ్డెక్కిన భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు చిరు వ్యాపారులు సామాన్య మధ్యతరగతి వారి "బతుకుబళ్లు" సీజ్ చేశారు. స్టేషన్ల ముందు లక్షలాది వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి పెనాల్టీలు లేకుండా తక్షణం వాహనాలు విడుదల చేయమని ప్రజలు అడుగుతున్నారు స్పందించండి జగన్ గారు' అని దేవినేని ఉమ పేర్కొన్నారు.


More Telugu News