ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే: సోమిరెడ్డి

  • దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్
  • ఉపాధి లేక స్వస్థలాలకు వెళుతున్న కార్మికులు
  • కాలినడకన వేల కిలోమీటర్లు వెళ్లే సాహసం
  • బాధాకరమైన విషయం అంటూ సోమిరెడ్డి స్పందన
కరోనా మహమ్మారిని రూపుమాపే క్రమంలో ప్రకటించిన లాక్ డౌన్ వలస జీవుల పాలిట శాపమైంది. ఉన్నచోట ఉపాధి కరవై, సొంతూరికి వెళ్లే మార్గం లేక కాలినడకన వేల కిలోమీటర్లు ప్రయాణించే సాహసాలకు ఒడిగడుతూ ప్రమాదాలకు గురవుతున్న తీరు అత్యంత దయనీయం. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ లో పుట్టిన పసికందుతో పాటు చిన్నపిల్లలతో ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వలస కార్మికుల కుటుంబాలు 46 డిగ్రీల ఎండలో రోడ్డున పడే పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకువచ్చాయని ఆరోపించారు. ఇది బాధాకరమైన విషయం అని, ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని అభిప్రాయపడ్డారు.


More Telugu News