పెద్దపల్లి జిల్లాలో పెళ్లిపత్రికే మాస్కుగా మారిన వేళ..!
- లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి
- పెళ్లికి వచ్చిన వారికి మాస్కుల పంపిణీ
- మాస్కుపై వధూవరుల ఫొటోలు, పెళ్లి వివరాల ముద్రణ
కరోనా కట్టడి కోసం ప్రకటించిన లాక్ డౌన్ పెళ్లిళ్లు చేసుకునే వారి పాలిట ఎంతో కష్టంగా మారింది. బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే వీల్లేదు... భౌతికదూరం, ముఖానికి మాస్కులతో జరిగేది కూడా ఓ పెళ్లేనా అనుకుంటూ వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, పెద్దపల్లి జిల్లా తొగర్రాయిలో ఓ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైంది. కొద్దిమంది అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
విశేషం ఏంటంటే... ఈ పెళ్లికి వచ్చినవారందరికీ మాస్కులు పంపిణీ చేశారు. ఆ మాస్కులపై వధూవరుల ఫొటోలు, పెళ్లివివరాలు ముద్రించారు. ఏకంగా పెళ్లిపత్రికనే మాస్కుపైకి ఎక్కించారు. ఈ పెళ్లికి వచ్చిన అందరి ముఖాలకు ఈ తరహా మాస్కులు కనువిందు చేశాయి. వధూవరులు, పురోహితుడు సైతం ఈ మాస్కులనే ధరించారు. పెళ్లింటి వారి ప్రయత్నాన్ని గ్రామస్తులు, బంధుమిత్రులు అభినందించారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే పెళ్లి చేసుకోవడం పట్ల అధికారులు కూడా హర్షం వ్యక్తం చేశారు.