రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవాళ్లు కాదు: 'నిమ్మగడ్డ' వ్యవహారంలో సీఎం రమేశ్ స్పందన
- హైకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం రమేశ్
- ఎంత గొప్పవాళ్లైనా రాజ్యాంగానికి లోబడాలని వ్యాఖ్యలు
- వ్యక్తుల కంటే రాజ్యాంగమే గొప్పదని వ్యాఖ్య
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నే కొనసాగించాలంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డనే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పు హర్షణీయం అని వ్యాఖ్యానించారు.
ఎంతటి గొప్పవాళ్లైనా రాజ్యాంగానికి లోబడి పరిపాలించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ తీర్పు ద్వారా అర్థమవుతోందని తెలిపారు. అందరికంటే, అన్నిటికంటే రాజ్యాంగమే గొప్పదని, వ్యక్తులు కాదని సీఎం రమేశ్ హితవు పలికారు. వ్యవస్థలు శాశ్వతంగా ఉండాలని, రాజ్యాంగానికి లోబడి పరిపాలన ఉండాలని, ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.