సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఎన్టీఆర్ సరసన మరోసారి సమంత
  • బాలకృష్ణ నిర్ణయం కోసం వెయిటింగ్
  • యువ దర్శకుడికి చరణ్ ఛాన్స్  
*  ఎన్టీఆర్, సమంత జంట మరోసారి కలసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి., ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతోంది. ఇందులో కథానాయికగా సమంతను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన పాత్రను బాలకృష్ణతో చేయించాలని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ భావిస్తోంది. అయితే, బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఆయన మలయాళ సినిమాను చూశాక ఏ నిర్ణయం చెబుతారని అంటున్నారు. మరో పాత్రకు గాను రానా, రవితేజ పేర్లు వినిపిస్తున్నాయి.
*  'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రాల తర్వాత రాంచరణ్ నటించే చిత్రం ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదు. పలువురు దర్శకులు ఆయనకు కథలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో 'జెర్సీ', 'మళ్లీ రావా' వంటి చిత్రాలను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ తదుపరి సినిమా ఉండచ్చని వార్తలు వస్తున్నాయి.  


More Telugu News