నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా సుప్రీంలో కేవియట్

  • ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలన్న హైకోర్టు
  • సుప్రీంకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం 
  • సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ నిన్న హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. గుంటూరు కాంగ్రెస్ నాయకుడు మస్తాన్ వలీ తరఫున ఆయన న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ వేశారు.


More Telugu News