ఇదేమి వీడియో బాబోయ్... నవ్వాపుకోలేకపోతున్నాను: ఫన్నీ వీడియో పంచుకున్న క్రికెటర్ అశ్విన్

  • క్రికెట్ పై గ్రామీణ యువకుల టిక్ టాక్ వీడియో
  • డీఆర్ఎస్ స్కిట్ తో నవ్వించిన వైనం
  • థర్డ్ అంపైర్ టీవీ రీప్లేలకు అచ్చమైన అనుకరణ
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ టిక్ టాక్ వీడియోలో కొందరు గ్రామీణ ప్రాంతాల యువకులు క్రికెట్ ఆడుతూ, డీఆర్ఎస్ విధానాన్ని అనుకరిస్తూ ఓ స్కిట్ చేయడం చూడొచ్చు. సాధారణంగా క్రికెటర్లు మైదానంలో డీఆర్ఎస్ కు అప్పీల్ చేసినప్పుడు థర్డ్ అంపైర్ టెలివిజన్ రీప్లేలు ఎలా చూస్తాడో, ఈ పద్ధతిలోనే గ్రామీణ యువకులు తమదైన శైలిలో చేసి చూపించారు. దీనిపై అశ్విన్ వ్యాఖ్యానిస్తూ, "బాబోయ్, ఇదేమి వీడియో... నవ్వాపుకోలేకపోతున్నాను, పొట్ట చెక్కలయ్యేలా ఉంది" అంటూ స్పందించారు.



More Telugu News