ప్రభుత్వ విధానం న్యాయం కోసం తపించినట్టుగా లేదు, న్యాయవ్యవస్థల మీద కక్షతో పోరాడినట్టుంది: వర్ల రామయ్య
- న్యాయ వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి సరికాదన్న వర్ల
- రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిక
- రాజ్యాంగ గౌరవం కాపాడండి అంటూ హితవు
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం సహా అనేక అంశాల్లో ఇటీవల ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో వ్యతిరేక తీర్పులు రావడం తెలిసిందే. ఈ తీర్పులపై సర్కారు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తలపోస్తోంది.
ఈ నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు. సీఎం గారూ, న్యాయవ్యవస్థల తీర్పులపై ప్రభుత్వ సంఘర్షణ వైఖరి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానం న్యాయంకోసం తపించినట్టుగా లేదని, న్యాయ వ్యవస్థలపై కక్షతో పోరాడినట్టుగా ఉందని విమర్శించారు. రాజ్యాంగ గౌరవం కాపాడుతూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ హితవు పలికారు.