లైంగిక వేధింపులే నన్ను నటనకు దూరం చేశాయి: తమిళ నటి కల్యాణి

  • టీవీ ఇండస్ట్రీలోనూ వేధింపులు తప్పలేదు
  • మా అమ్మకు ఫోన్ చేసి సర్దుకుపోవాలని అడిగేవారు
  • ప్రస్తుతం కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉన్నా
పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల వల్లే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని తమిళనటి కల్యాణి తెలిపారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కల్యాణి పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించారు.

పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి ‘అలై తండా వానమ్’ చిత్రంలో నటించినట్టు చెప్పిన కల్యాణి.. తనకు వరుసపెట్టి అవకాశాలు వస్తున్న సమయంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తన తల్లికి ఫోన్ చేసి సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలని అన్నారని గుర్తు చేసుకున్నారు.

వారి మాటలతోనే తాను సినీ రంగానికి దూరమైనట్టు చెప్పారు. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్నానని, అయితే, అక్కడ కూడా వేధింపులు ఎదురవడంతో ఇక పూర్తిగా నటనకు దూరమయ్యానని కల్యాణి వివరించారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు. ‘జయం’, ‘అలై తండా వానమ్’, ‘ఎస్ఎంఎస్’ వంటి సినిమాలతో పాటు తెలుగులో ‘మళ్లీ మళ్లీ’ సినిమాలో కల్యాణి నటించారు.


More Telugu News