ట్రంప్‌ ట్వీట్‌పై ట్విట్టర్‌లా మేము చేయం!: ఫేస్‌బుక్‌ స్పష్టీకరణ

  • అమెరికాలో ఒక నల్లజాతీయుడిని చంపిన పోలీసు
  • ‘వెన్‌ లూటింగ్‌ స్టార్ట్స్, షూటింగ్‌ స్టార్ట్స్‌’ అని ట్రంప్ ట్వీట్
  • తొలగించిన ట్విట్టర్‌
  • తాము అలా చేయబోమని ఫేస్‌బుక్‌ వివరణ
అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే ఒక నల్లజాతీయుడిని అమెరికన్‌ పోలీసు గొంతుపై తొక్కి చంపేసిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు, లూటీలు చోటు చేసుకోవడంతో ‘వెన్‌ లూటింగ్‌ స్టార్ట్స్, షూటింగ్‌ స్టార్ట్స్‌’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌ను ట్విట్టర్‌ తొలగించి ఫేస్‌బుక్‌ను కూడా ఆ సైట్‌నుంచి తొలగించమని కోరింది.

అయితే, అందుకు ఫేస్‌బుక్‌ నిరాకరించింది. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ దీనిపై స్పందిస్తూ... ప్రతిస్పందనల ఫలితాలను ప్రజలకు తెలియకుండా దాచేయడం సరికాదని, ఇలా చేస్తే మరింత నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ని ఆయన చేసిన ప్రకటనలా చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని ట్రంప్ చెప్పిన వాస్తవంలా పరిగణించాలని చెప్పుకొచ్చారు.


More Telugu News