పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై పాశవికంగా దాడి చేశారు: చంద్రబాబు

  • టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండాపోయిందన్న చంద్రబాబు
  • మహిళలపైనా దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం
  • డీజీపీ వెంటనే స్పందించాలంటూ డిమాండ్
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని పార్టీ అధినేత చంద్రబాబు ఆక్రోశించారు. పొన్నూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలపై పాశవికంగా దాడులు జరిపారని ఆరోపించారు. మహిళలపైనా వైసీపీ అరాచక శక్తులు దాడులకు తెగబడ్డాయని మండిపడ్డారు.

ఏడాదిగా బీసీలు, దళితులపై దాడులు శ్రుతిమించిపోయాయని అన్నారు. డీజీపీ తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, భూములు సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News