ఢిల్లీలో మళ్లీ కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

  • ఢిల్లీ వాసులను భయపెడుతున్న వరుస భూకంపాలు
  • రిక్టర్ స్కేలుపై  3.2గా తీవ్రత నమోదు
  • నాలుగు రోజల వ్యవధిలో రెండోసారి
ఢిల్లీలో గత రాత్రి భూమి మళ్లీ కంపించింది. రాత్రి 10:42 గంటలకు నోయిడాలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో భయపడిన ప్రజలు రోడ్లపైకి వచ్చి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లలో భూ ప్రకంపనలు సంభవించాయని, 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలిపింది. ఢిల్లీలో భూమి కంపించడం నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కాగా, ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి.


More Telugu News