చరణ్ కోసం రాజమౌళి అలా ప్లాన్ చేశాడట!
- లాక్ డౌన్ వల్ల 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ అప్సెట్
- మరోపక్క 'ఆచార్య'లో నటిస్తున్న చరణ్
- ముందుగా చరణ్ షూటింగ్ పార్ట్ చిత్రీకరణ
లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన తెలుగు సినిమాలలో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. షూటింగుకి బ్రేక్ పడడంతో సినిమా షెడ్యూల్ అంతా అప్సెట్ అయింది. దాంతో విడుదల తేదీ కూడా మళ్లీ వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు షూటింగులకు ప్రభుత్వం అనుమతించడంతో ఈ సినిమా షూటింగును ప్రారంభించడానికి దర్శకుడు రాజమౌళి చకచకా సన్నాహాలు చేస్తున్నారు. పరిమిత యూనిట్ సభ్యులతో (అంటే ఏభై మంది మించకుండా) షూటింగు మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో ముందుగా రామ్ చరణ్ షూటింగు పార్టును పూర్తి చేయాలని రాజమౌళి నిర్ణయించాడట.. దీనికి ఓ కారణముంది. చరణ్ మరోపక్క తన తండ్రి నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్' పూర్తయితేనే కానీ అందులో నటించడానికి వీల్లేదు. దాంతో ముందుగా చరణ్ షూటింగును కానిచ్చేసి, అతనిని పంపించాలని దర్శకుడు భావిస్తున్నాడట. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి చరణ్ ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడని సమాచారం. చరణ్ పార్ట్ పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ పార్ట్ చిత్రీకరిస్తారట.