ఏపీలో పలు ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు: వాతావరణ శాఖ
- కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
- ఉత్తర కోస్తాలో మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు
- నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు
నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వివరించారు.
రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వివరించారు. అలాగే, ఆగ్నేయ బంగాళాఖాతంతోపాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు రానున్నాయని చెప్పారు.