తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగికి కరోనా.. కలకలం!
- సీఎంఓ కార్యాలయంలో ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్
- 30 మంది ఉద్యోగుల శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది
- తీవ్ర ఆందోళనలో కార్యాలయ సిబ్బంది
హైదరాబాదులో కరోనా ఉద్ధృతంగా వుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో కూడా కరోనా కలకలం రేగింది. మెట్రో రైల్ భవన్ లో పని చేస్తున్న సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు సమాచారం. సదరు ఉద్యోగి కుమారుడు ఇటీవలే మహారాష్ట్ర నుంచి హైదరాబాదుకు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారానే ఆయనకు వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు.
సీఎంఓకు ఎవరూ రావద్దని అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. అంతేకాదు 30 మంది ఉద్యోగుల శాంపిళ్లను చెస్ట్ హాస్పిటల్ సిబ్బంది సేకరించారు. మరోవైపు సీఎంఓలో పని చేస్తున్న వారిలో ఎక్కువ వయసు వారు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో, ముఖ్యమంత్రి కార్యాలయంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.