సమ్మె కొనసాగించి తీరుతామంటున్న గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు
- గాంధీ సూపరింటిండెంట్ కు లేఖ రాసిన జూనియర్ డాక్టర్లు
- తమ డిమాండ్లకు హామీ ఇవ్వలేకపోయారని ఆరోపణ
- సీఎం, ఆరోగ్య మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్
కరోనా రోగి బంధువు ఓ జూనియర్ వైద్యుడిపై దాడి చేయడాన్ని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాసింది.
తమ డిమాండ్ల పట్ల న్యాయం జరగకపోవడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటిండెంట్ కు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తమకు సరైన విధంగా హామీ ఇవ్వలేకపోయారని వెల్లడించారు. కొవిడ్ కేసుల వికేంద్రీకరణ అంశం సహా తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని, దీనిపై ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.