గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్

  • కరోనా కాలంలోనూ కొనసాగుతున్న చాలెంజ్
  • ప్రభాస్ నివాసానికి వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్
  • ఎంపీతో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ సెలబ్రిటీలకు ఇష్టమైన చాలెంజ్ గా మారిపోయింది. కరోనా కాలంలోనూ ఇది కొనసాగడం విశేషం. తాజాగా ఈ చాలెంజ్ లో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆద్యుడైన ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి తన నివాసంలో మొక్కలు నాటారు. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కు ధరించిన ప్రభాస్, సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతరం ఓ సెల్ఫీతో ముగించారు.


More Telugu News