సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్టుమార్టం రిపోర్టులోని అంశాలివి!
- నిన్న ఆత్మహత్య చేసుకున్న సుశాంత్
- మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో మృతి
- ఊపిరి ఆడక చనిపోయాడన్న వైద్యులు
నిన్న ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో, 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. నిన్న సుశాంత్ మరణం సినీ, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు.