ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబూ, ఈ అంకెలు చూడు!: విజయసాయిరెడ్డి
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడ్డది
- బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం
- కాపులకు 42.35 శాతం
- మైనార్టీలకు 116 శాతం పెంచారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు నాయుడు ఈ అంకెలు చూడు అర్థమవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కట్టుబడ్డది. కులాలను రెచ్చగొట్టి, ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు 68.18 శాతం, కాపులకు 42.35 శాతం, మైనార్టీలకు 116 శాతం పెంచారు' అని ఆయన వివరించారు. కాగా, నిన్న అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.