మా వాక్సిన్ తీసుకుంటే, ఏడాది పాటు కరోనా దూరం: ఆస్ట్రాజెనెకా

  • ప్రారంభమైన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్
  • అన్నీ సవ్యంగా సాగితే అక్టోబర్ లో వాక్సిన్
  • వెల్లడించిన సంస్థ సీఈఓ సోరియట్
తాము తయారు చేసిన కరోనా వాక్సిన్ వేసుకుంటే, ఏడాది పాటు వైరస్ నుంచి రక్షణ కలిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి వాక్సిన్ ను పంపిణీ చేస్తామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాస్కర్ సోరియట్ తెలియజేశారు.

బ్రిటన్ లో తమ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలో ముగుస్తాయని, మూడవ దశను ఇప్పటికే ప్రారంభించామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ లోగా ఈ ట్రయల్స్ ఫలితాలు రానున్నాయని, ఇప్పటికే వాక్సిన్ తయారీని కూడా ప్రారంభించామని, ట్రయల్స్ లో ఫలితాలు అనుకూలంగా రావాల్సి వుందని బెల్జియం రేడియో స్టేషన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

తమ సంస్థ 40 కోట్ల వాక్సిన్ డోస్ లను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ తదితర దేశాలతో డీల్స్ కుదుర్చుకుందని వెల్లడించారు. అయితే, ఏడాది తర్వాత మరో డోస్ తీసుకోవాలా? లేక ఇతర వ్యాక్సిన్ ఏదైనా తీసుకోవాలా? అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదు.


More Telugu News