ఆన్ లైన్ ఎంబీఏ కోర్సులో చేరిన ముద్దుగుమ్మ!
- ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తారలు
- మూడు నెలల పాటు ముంబైలోనే గడిపిన రకుల్
- ఆన్ లైన్ తరగతులకు హాజరు
- సడలింపుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన రకుల్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల సుమారు మూడు నెలల పాటు ఎక్కడి వాళ్లు అక్కడే ఇరుక్కుపోయారు. ఎంతటి వారైనా ఇళ్లకే పరిమితం కావలసివచ్చింది. దీంతో ఎప్పుడూ షూటింగులతో బిజీగా వుండే సినీ తారలు కూడా గుమ్మం దాటలేదు. అయితే, అనుకోకుండా వచ్చిన ఈ తీరిక సమయాన్ని పలువురు పలురకాలుగా సద్వినియోగం చేసుకున్నారు.
అలాగే, తను కూడా మూడు నెలల పాటు ముంబైలోని తన ఫ్లాట్ లో వుండిపోయానని చెబుతోంది అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఖాళీ సమయంలో తాను చాలా పనులు చేశానని చెప్పింది. పొద్దున్నే ఎక్కువ సేపు వ్యాయామం చేసే దాన్నని, అలాగే తన యూ ట్యూబ్ ఛానెల్ మీద చాలాసేపు వర్క్ చేశానని తెలిపింది.
ఇక ఈ సమయంలోనే చదువు మీద కూడా దృష్టి పెట్టానని, ఆన్ లైన్ ఎంబీఏ తరగతులకు హాజరయ్యానని చెప్పింది. ఈ విధంగా తాను లాక్ డౌన్ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకున్నానని తెలిపింది. ఇటీవలే లాక్ డౌన్ నుంచి పలు సడలింపులు ఇవ్వడంతో ఢిల్లీలో వున్న తల్లిదండ్రులను చూడడానికి ఈ ముద్దుగుమ్మ వెళ్లింది.