వర్ల రామయ్యను చంద్రబాబు బలిపశువును చేశారు: రోజా

  • రాజ్యసభ స్థానాన్ని గెలిచే సంఖ్యాబలం టీడీపీకి లేదు
  • అయినా దళితుడైన వర్లను బరిలోకి దింపారు
  • దళితుడికి టికెట్ ఇవ్వలేదంటూ జగన్ పై బురద చల్లుతున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేకున్నప్పటికీ దళితుడైన వర్ల రామయ్యను బరిలోకి దించారని మండిపడ్డారు. తన రాజకీయాల కోసం వర్ల రామయ్యను బలిపశువును చేశారని విమర్శించారు.

అధికారాన్ని కోల్పోయిన తర్వాత చంద్రబాబు కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన చంద్రబాబు... ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పారు. రాజ్యసభ సీటును గెలిచే అవకాశం ఉంటే క్యాష్ ను చూస్తారని ... లేనప్పుడు క్యాస్ట్ ను చూస్తారని దుయ్యబట్టారు

రాజ్యసభ టికెట్ ను దళితులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని... అన్ని కులాలకు న్యాయం చేసింది జగన్ మాత్రమేనని రోజా అన్నారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్ దని చెప్పారు.


More Telugu News