అంబులెన్సుల కుంభకోణాన్ని సాక్ష్యాలతో బయటపెట్టాం: దేవినేని ఉమ
- తప్పుడు ఆరోపణలతో మా నాయకులను అరెస్టులు చేస్తున్నారు
- 108 అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల కుంభకోణం
- ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి చెప్పండి
ఆంధ్రప్రదేశ్లో అంబులెన్సుల నిర్వహణలో రూ.307 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలతోనే తాము ఈ విషయాలు చెబుతున్నామని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలను పోస్ట్ చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సీఎం జగన్ను నిలదీశారు.
'తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి మా నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. 108 అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని సాక్ష్యాల సహా బయటపెట్టాం. బాధ్యులయిన మీ పార్టీ నాయకుల మీద, వారి బంధువుల మీద ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.